సెప్టెంబర్ లో పన్నెండు రోజులు బ్యాంకులు సెలవు..!

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బ్యాంకు సెలవులు వివరాలని చూస్తే.. మొత్తం 12 రోజుల పాటు సెలవులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ లో వీకెండ్ సెలవులతో పాటు పండుగలు కూడా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ నెలలో ఏ రోజు ఏఏ రాష్ట్రాలలో సెలవులు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.

సెప్టెంబర్ 10న వినాయక చవితి పండుగ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు అహ్మదాబాద్, బెల్లాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్, పనాజీ ప్రాంతాలలో సెలవులు. అదే విధంగా సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి రోజు ఆరోజున కొచ్చి మరియు తిరువనంతపురంలో బ్యాంకులు సెలవు ఉంటాయి. దానికి తోడు రెండవ శనివారం, నాలుగవ శనివారం, ఆదివారాలు కూడా బ్యాంకులకు సెలవు.

సెప్టెంబర్ 2021 బ్యాంకుల సెలవులు వివరాలు:

1) సెప్టెంబర్ 5 – ఆదివారం

2) సెప్టెంబర్ 8 – శ్రీమంత శంకరదేవ తిథి – (గౌహతి)

3) సెప్టెంబర్ 9 – తీజ్ (హరితాళిక) – (గ్యాంగ్‌టక్)

4) సెప్టెంబర్ 10 – గణేష్ చతుర్థి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్, పనాజీ)

5) సెప్టెంబర్ 11 – రెండవ శనివారం / గణేష్ చతుర్థి (2 వ రోజు) – (పనాజీ)

6) సెప్టెంబర్ 12 – ఆదివారం

7) సెప్టెంబర్ 17 – కర్మ పూజ – (రాంచీ)

8) సెప్టెంబర్ 19 – ఆదివారం

9) సెప్టెంబర్ 20 – ఇంద్రజాత్రా – (గ్యాంగ్‌టక్)

10) సెప్టెంబర్ 21 – శ్రీ నారాయణ గురు సమాధి రోజు – (కొచ్చి మరియు తిరువనంతపురం)

11) సెప్టెంబర్ 25 – నాల్గవ శనివారం

12) సెప్టెంబర్ 26 – ఆదివారం

Read more RELATED
Recommended to you

Latest news