బ్యాంక్ ఆఫ్ బరోడా గ్రీన్ అలర్ట్.. ఈ రంగులు ఏం చెప్తాయంటే..!

Join Our Community
follow manalokam on social media

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తన వినియోగదారులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. బ్యాంక్ పాస్‌వర్డ్‌కు సంబంధించి పలు అంశాలను వెల్లడించింది. వినియోగదారులు బ్యాంకు వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యేటప్పుడు ఎంటర్ చేసే పాస్‌వర్డ్ గురించి పలు జాగ్రత్తలను పంచుకుంది. పాస్‌వర్డ్ తయారీలో గ్రీన్ మార్క్ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని, ఒక్క బ్యాంక్ ఆఫ్ బరోడానే కాకుండా.. ఇతర బ్యాంకుల వినియోగదారులకు ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేసినట్లయితే మీ బ్యాంకు ఖాతా సురక్షితంగా ఉంటుందని బీఓబీ స్పష్టం చేసింది.

bank-of-baroda
bank-of-baroda

వినియోగదారులు బ్యాంకు పాస్‌వర్డ్ తయారు చేసుకునేటప్పుడు గ్రీన్ అలర్డ్ గురించి తెలుసుకోవాలి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా ఓపెన్ చేసినప్పుడు వినియోగదారులకు బ్యాంకు పాస్‌వర్డ్ తయారు చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంచుతుంది. ఇందులో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు కనిపిస్తాయి. ఖాతాదారులు పాస్‌వర్డ్ ఎంటర్ చేసినప్పుడు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, గ్రీన్ అలర్ట్ చేస్తూ వినియోగదారులకు అప్రమత్తం చేస్తుంది. అయితే ఈ రంగులేంటో.. వీటి వల్ల ఉపయోగాలేంటో.. తెలుసుకుందాం.

ఎరుపు, పసులు రంగుల గురించి..
వినియోగదారులు పాస్‌వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు కచ్చితంగా మూడు జాగ్రత్తలు పాటించాలి. పాస్‌వర్డ్ జనరేట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే బ్యాంకు ఖాతా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. తెలిసిన పాస్‌వర్డ్ వేసుకోవడం వల్ల ఖాతా సురక్షితంగా పరిగణించబడదు. పాస్‌వర్డ్ జనరేట్ చేసేటప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు కనిపిస్తాయి. ఖాతాదారుడు పాస్‌వర్డ్ క్రియేట్ చేసినప్పుడు పాస్‌వర్డ్ బలహీనంగా ఉంటే రెడ్, ఎల్లో రంగులు అలర్ట్ చేస్తాయి. ఈ రంగులోనే పాస్‌వర్డ్ ఉంటే ఖాతా సులభంగా హ్యాకింగ్‌కి గురవుతుంది. అందుకే ఆల్ఫాబెట్స్, క్యాపిటల్, స్మాల్స్, డిజిట్స్, సింబల్స్‌తో పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి.

గ్రీన్ కలరే బెస్ట్..
వినియోగదారుడు పాస్ వర్డ్ తయారు చేసేటప్పుడు గ్రీన్ కలర్‌లో వచ్చినట్లయితే ఆ ఖాతా సురక్షితమైనదిగా పరిగణిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. మీ పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా తయారు చేసుకోవాలని అనుకుంటే.. పైన పేర్కొన్న విధంగా అన్ని రకాలు డిజిట్స్, ఆల్ఫాబెట్స్ ఉపయోగించాలి. పాస్‌వర్డ్ ఎంత కఠినంగా ఉంటే మీ బ్యాంకు ఖాతా అంత సురక్షితంగా ఉంటుందని, కస్టమర్లు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని బ్యాంక్ వెల్లడించింది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...