మనకి ఏదో ఒక ముఖ్యమైన బ్యాంకు పని ఉండే ఉంటుంది. నిజానికి చాలా మంది బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలంటే ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యమైన పనులను కూడా వాయిదా వేస్తూ ఉంటారు. అయితే ఇక డెడ్ లైన్ వచ్చేసింది అంటే కంగారు పడుతూ ఉంటారు.
డెడ్లైన్ దగ్గరికి వచ్చాక బ్యాంకులకు సెలవు అయితే బ్యాంకు పనులు అవ్వవు. దీని వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే ఎప్పుడూ ముందుగానే మీరు షెడ్యూల్ చేసుకోవడం మంచిది. ఏ రోజులు బ్యాంకులు పనిచేస్తున్నాయి..?, ఏఏ రోజులు బ్యాంకులకు సెలవు అనేది గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగా మీరు పనులు పూర్తి చేసుకుంటే బెస్ట్.
లేదంటే అనవసరంగా పనులు ఆగిపోతాయి. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండవు. రాష్ట్రాన్ని బట్టి ఈ సెలవులు మారతాయి. అయితే మరి ఏ రోజుల్లో ఎక్కడ సెలవులు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
April 1: ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్ క్లోజింగ్ డే – ఐజ్వాల్, చండీగఢ్, శిల్లోంగ్, షిమ్లా మినహా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సెలవే.
April 2: గుడి పడ్వా/ఉగాది /1st నవరాత్ర/తెలుగు న్యూ ఇయర్/సాజీబు నొంగ్మపంబా- కర్ణాటక, మహారాష్ట్ర, తమిళ్ నాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ, గోవా మరియు జమ్మూ & కాశ్మీర్
April 4: సర్హులు- ఝార్ఖండ్
April 5: బాబు జగజ్జీవన్ రామ్స్ జన్మదినం- తెలంగాణ
April 14: అంబెడ్కర్ జయంతి/మహావీర్ జయంతి/బైసాఖి/వైశాఖి/తమిళ్ న్యూ ఇయర్/చేయరావుబా/బిజూ/బోహాగ్ బిహు- మేఘాలయ, హిమాచల్ మినహా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సెలవే.
April 15: గుడ్ ఫ్రైడే/బెంగాలీ న్యూ ఇయర్ డే (నబాబార్ష)/హిమాచల్ డే/విషు/బోహాగ్ బిహు- రాజస్థాన్, జమ్మూ, శ్రీనగర్ మినహా అన్ని చోట్ల సెలవే.
April 16: బోహాగ్ బిహు- అస్సాం
April 21: గరియా పూజ- త్రిపుర
April 29: Shab-I-Qadr/Jumat-ul-Vida – జమ్మూ అండ్ కాశ్మీర్
April 3: ఆదివారం
April 9: రెండవ శనివారం
April 10: ఆదివారం
April 17: ఆదివారం
April 23: నాలుగో శనివారం
April 24: ఆదివారం