సెప్టెంబర్ నెలలో 15 రోజులు బ్యాంకులు క్లోజ్..!

-

ముఖ్యమైన బ్యాంకు పనుల్ని ఎప్పటికప్పుడు చేసుకోవడం మంచిది. సెలవులు వస్తే బ్యాంకు పనులకు ఆటంకం కలుగుతుంది. అయితే సెప్టెంబర్ నెలలో ఏ రోజులు బ్యాంకులకు సెలవులు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. వీటిని గమనించి మీరు మీ బ్యాంకు పనుల్ని పూర్తి చేసుకోవడం మంచిది. లేదంటే అనవసరంగా బ్యాంకు పని అవ్వక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సెప్టెంబర్ లో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులు.

సెప్టెంబర్ 1 ఆదివారం
సెప్టెంబర్ 4 (బుధవారం): శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి కారణంగా అసోంలో బ్యాంకులు మూతపడ్డాయి.
సెప్టెంబర్ 7 (శనివారం): గణేష్ చతుర్థి/వరసిద్ధి వినాయక వ్రతం/వినాయక చతుర్థి, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, గోవాలలో బ్యాంకులు క్లోజ్.
సెప్టెంబర్ 8 ఆదివారం
సెప్టెంబర్ 14 (శనివారం): కర్మ పూజ/మొదటి ఓనం కారణంగా కేరళ, జార్ఖండ్‌ లో సెలవు. అలాగే రెండవ శనివారం కారణంగా క్లోజ్
సెప్టెంబర్ 15: ఆదివారం
సెప్టెంబర్ 16 (సోమవారం): మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ కారణంగా గుజరాత్, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో బ్యాంకులు క్లోజ్.
సెప్టెంబర్ 17 (మంగళవారం): ఇంద్రజాత్ర/ఈద్-ఎ-మిలాద్ (మిలాద్-ఉన్-నబీ) కారణంగా సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లలో సెలవు.
సెప్టెంబర్ 18 (బుధవారం): పాంగ్-లాబ్సోల్ కారణంగా అసోంలో బ్యాంకులు క్లోజ్.
సెప్టెంబర్ 20 (శుక్రవారం): ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ కారణంగా సెలవు
సెప్టెంబర్ 21 (శనివారం): శ్రీ నారాయణ గురు సమాధి దినం కారణంగా కేరళలో బ్యాంకులు క్లోజ్.
సెప్టెంబర్ 22: ఆదివారం
సెప్టెంబర్ 23 (సోమవారం): మహారాజా హరి సింగ్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు క్లోజ్.
సెప్టెంబర్ 28: నాల్గవ శనివారం
సెప్టెంబర్ 29: ఆదివారం

Read more RELATED
Recommended to you

Latest news