అలర్ట్: జూన్ 27న సమ్మె.. 3 రోజులు బ్యాంకులు బంద్..

-

ప్రభుత్వం ఆద్వర్యంలో పని చేస్తున్న బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.ఈ నెల 27 సమ్మెకు దిగే అవకాశం ఉంది. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు పని నిలిపివేయనున్నారు.9 బ్యాంకు యూనియన్ల సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ మేరకు వెల్లడించింది. ఉద్యోగులు సమ్మె చేస్తే వరుసగా 3 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నెల 25వ తేదీ నెలలో నాలుగో శనివారం, 26 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు..

 

ఇక 27న బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. వరుసగా మూడు రోజుల పాటు ప్రజలకు బ్యాంకింగ్ సేవలు దూరం కానున్నాయి. ఈ పరిస్థితిలో అనేక మంది సామాన్యులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తోంది.బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని యూనియన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ప్రైవేట్ రంగంలోని అనేక బ్యాంకులు ఇప్పటికే ఈ పని పద్ధతిని అమలు చేస్తున్నాయి.

కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇలాంటి వెసులుబాటు లేక పోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి అవకాశం తమకు కల్పించాలను డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వం ముందు ఉంచిన పెన్షన్ డిమాండ్ ను సైతం అంగీకరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకుంటే.. దేశ వ్యాప్తంగా 9 బ్యాంకులకు చెందిన 7 లక్షల మంది ఉద్యోగులు సమ్మేలో పాల్గొంటారని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా వెల్లడించారు.అడిగిన డిమాండ్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పకుంటే మాత్రం సమ్మె కొనసాగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news