ఈ కార్డుతో సులభంగా మూడు లక్షల రుణం పొందొచ్చు..!

కస్టమర్స్ కోసం దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎన్నో రకాల సేవలు ఇస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే సర్వీసుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు సర్వీస్ కూడా ఒకటి అని అందరికీ తెలిసిందే. అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కనుక ఉంటే ఈజీగా రూ.3 లక్షల వరకు రుణం పొందొచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

SBI
SBI

కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ఇస్తోంది. దీన్ని కేసీసీ స్కీమ్ అని కూడా పిలుస్తారు. రైతుల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడం జరిగింది. రైతులు ఈ కార్డు ని పొందాలంటే బ్యాంక్ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

మీరు నేరుగా ఎస్‌బీఐ బ్యాంక్‌ కి వెళ్లి కూడా దరఖాస్తు చేయొచ్చు. ఇది ఇలా ఉంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే తక్కువ వడ్డీ రేటుతో రూ.3 లక్షల వరకు లోన్ కూడా తీసుకోవడానికి అవుతుంది. దీని పై 4 శాతం వడ్డీ రేటు పడుతుంది. అయితే సక్రమంగా లోన్ డబ్బులు కట్టే వారికే ఇది వర్తిస్తుంది. లేదు అంటే ఏడు శాతం వడ్డీ చెల్లించాలి.

ఇది ఇలా ఉంటే కిసాన్ క్రెడిట్ కార్డు కోసం బ్యాంక్‌కు వెళ్ళక్కర్లేదు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారానే ఈజీగా కార్డుని పొందొచ్చు. యోనో యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత యోనో అగ్రికల్చర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు అక్కడ అకౌంట్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కేసీసీ రివ్యూ సెక్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత అప్లై పైన క్లిక్ చెయ్యాలి అంతే.