సెప్టెంబర్ – 2022 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు

-

కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యుసి సమావేశం ఇవ్వాళ సోనియాగాంధీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం పై కీలక చర్చ నిర్వహించారు సోనియాగాంధీ. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక పై కీలక నిర్ణయం తీసుకుంది సిడబ్ల్యూసి సమావేశం. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకొనున్నారు. ఈమేరకు పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు సమాచారం అందుతోంది.

congress
congress

సెప్టెంబర్ 2022 లో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు మీడియాతో చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. గతంలో ఒకటి రెండు సార్లు శాశ్వత అధ్యక్షుడు ఎన్నిక కోసం ప్రయత్నాలు జరిగినా ఆ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

మరికొంత కాలం సోనియానే పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తే… బాగుంటుందని చెప్పి ఆమెని తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అయితే ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ శాశ్వత అధ్యక్ష ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. 2022, సెప్టెంబరు లో ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని డిసైడ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news