ఏపీలో ఇక విద్యుత్ కోతలు ఉండవు : ఏపీ మంత్రి

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో విద్యుత్ కొరతపై ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అస్సలు విద్యుత్ కోతలు ఉండవని స్పష్టం చేశారు. నిధులు ఎంతైనా వెచ్చించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చెయ్యాలని సీఎం జగన్ ఆదేశించారని గుర్తు చేశారు.. సోలార్ విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ కొరత లేకుండా చూస్తామని స్పష్టం చేశారు మంత్రి బాలినేని.

విద్యుత్ కోతలు ఉన్నాయని తప్పుడు ప్రచారాలు చేసేవారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందని.. అత్యవసర బొగ్గు కొనుగోలు కు రూ. 250 కోట్లు జెన్కోకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారని స్పష్టం చేశారు..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన పార్టీ నేతలు… కావాలనే విద్యుత్ సంక్షోభం వ్యవహారంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాల చంద్రబాబు బ్రష్టు పట్టించారని… సోలార్ పవర్ ను కొనుగోలు చేయకుండా ప్రతిపక్షం అడ్డుకుంటుందని నిప్పులు చెరిగారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news