రుణగ్రహీతలకి అదిరే పండుగ ఆఫర్లు..!

చాలా మంది సొంతిల్లు కట్టుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తూ వుంటారు. మీరు కూడా సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా ..?, కానీ కుదరడం లేదా ..? అయితే మీకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే.. సొంత ఇంటి కల సాకారం ఇదే సరైన సమయం. పైగా మంచి లోన్స్ కూడా వస్తాయి.

 

punjab national bank

అది కూడా తక్కువ వడ్డీకే. పండుగ సీజన్‌లో బ్యాంకులు అదిరే ఆఫర్స్ ని తీసుకు రావడం జరిగింది. కనుక ఈ సమయం లో హౌసింగ్ లోన్ తీసుకుంటే బెస్ట్. అయితే ఏ బ్యాంక్ నుండి తక్కువ వడ్డీకే రుణాలు వస్తున్నాయి..?, ఎలాంటి లాభాలను పొందొచ్చు అంటే వాటి కోసం కూడా చూసేద్దాం.

ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB తాజాగా హోమ్ లోన్ తీసుకునే వాళ్లకి గుడ్ న్యూస్ చెప్పింది. అదిరే పండుగ ఆఫర్స్ ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ పబ్లిష్ నేషనల్ బ్యాంక్ స్వయంగా ట్విట్టర్ ద్వారా సూచించింది.

పీఎన్‌బీలో హోమ్ లోన్ తీసుకుంటే లోన్ ని తక్కువ వడ్డీకే పొందొచ్చు. వడ్డీ రేటు 6.6 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. దీని వలన ఇన్ స్టంట్ టాపప్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. వడ్డీ రేటు 7.15 శాతంగా ఉంటుంది. అలాగే హోమ్ లోన్ తీసుకునే వారికి 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ ఛార్జీల లో మినహాయింపుని కూడా పొందవచ్చు.