నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం.. ప్రజలకి రిలీఫ్…!

-

కేంద్రం పలు అంశాలకు సంబంధించిన గడువులు పొడిగించింది. దీనితో కస్టమర్స్ కి అది రిలీఫ్ గా ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇకేవైసీ దగ్గరి నుంచి ఈపీఎఫ్‌వో నామినేషన్ దాక కొన్ని డెడ్లైన్స్ ని మార్చింది. ఇక వాటి కోసం చూద్దాం.

 

RBI
RBI

EPFO తన పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు శుభవార్త చెప్పింది. ఇ-నామినేషన్ ప్రక్రియను డిసెంబర్ నెల తర్వాత కూడా చెయ్యచ్చని అంది. ముందు అయితే ఇ-నామినేషన్ ప్రక్రియను డిసెంబర్ 31లోపు పూర్తి చేయాల్సి ఉందన్నారు. కానీ ఈపీఎఫ్‌వో డిసెంబర్ 31 తర్వాత కూడా ఇనామినేషన్ పూర్తి చేయొచ్చని అంది. ఇది ఇలా ఉంటే 2020 – 21 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఇఫైల్డ్ ఐటీఆర్ వెరిఫికేషన్ గడువును 2022 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ అంది.

కనుక ఈ విషయం లో కంగారు పడాల్సిన పని లేదు. వాటిని ఎక్స్టెండ్ చేసారు కనుక వెరిఫికేషన్ ప్రాసెస్‌ను ఫిబ్రవరి 28లోగా కచ్చితంగా పూర్తి చేసుకోండి. అలానే 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫామ్ జీఎస్‌టీఆర్ 9, ఫామ్ జీఎస్‌టీఆర్ 9సీ దాఖలుకు గడువును కూడా ఎక్స్టెండ్ చేసారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఈ విషయాన్ని తెలిపింది.

సాధారణంగా ఈ గడువు 2021 డిసెంబర్ 31తో అయ్యిపోవాల్సి వుంది. కానీ వ్యాపారులకు మరో రెండు నెలల గడువు ఇచ్చారు. అదే విధంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఒక గుడ్ న్యూస్ ని అందించింది.

కేవైసీ అప్‌డేట్ తుది గడువును ఆర్‌బీఐ మరో మూడు నెలల పాటు అంటే మార్చి 31, 2022 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవైసీ అప్ డేట్ చేయకపోతే బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేయొద్దని తెలిపింది ఆర్బీఐ.

Read more RELATED
Recommended to you

Latest news