గోల్డ్ లోన్, కార్ లోన్, టూవీలర్ లోన్, పర్సనలో లోన్ తీసుకోవాలనుకునే వారికి ఈ బ్యాంక్ గుడ్ న్యూస్..!

-

మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ లేదంటే టూవీలర్ లోన్ తీసుకోవాలని అనుకునే వాళ్లకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

గోల్డ్ లోన్‌పై స్టేట్ బ్యాంక్ తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తోంది. 7.3 శాతం నుంచి వడ్డీ మొదలు అవుతోంది. రుణ మొత్తాన్ని చెల్లించడానికి పలు ఆప్షన్లు కూడా వున్నాయి. బుల్లెట్, ఓవర్‌డ్రాఫ్ట్, ఈఎంఐ వంటి వాటిని సెలెక్ట్ చేసుకోచ్చు. ఈ లోన్ ని మీరు 36 నెలలలోగా తిరిగి చెల్లించాలి.

ఇది ఇలా ఉంటే ఎస్‌బీఐ పర్సనల్ లోన్ ఆఫర్ కూడా బాగుంది. వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ వంటి వాటిని కొనుగోలు చెయ్యాలంటే ఈ లోన్ తీసుకొచ్చు. వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. కారు లోన్ కూడా అందుబాటులో వుంది.

వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. కారు ధరలో 90 శాతం మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. ప్రిపేమెంట్ చార్జీలు కూడా ఉండవు. అలాగే టూవీలర్ లోన్ పొందాలని అనుకుంటే ఈజీ రైడ్ ప్రిఅప్రూవ్డ్ రుణాలు లభిస్తున్నాయి. రూ.10 వేలకు ఈఎంఐ రూ.251 నుంచి ప్రారంభం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news