స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. గతంలో కన్నా ఇకపై అధిక రాబడి..!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. దీనితో కస్టమర్స్ ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దీనితో స్టేట్ బ్యాంక్ లో డబ్బు దాచుకునే వారికి రిలీఫ్ కలగనుంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంక్ అంది. దీర్ఘకాల ఎఫ్‌డీలకు ఈ పెంపు వర్తిస్తుందని స్టేట్ బ్యాంక్ చెప్పింది. గతంలో కన్నా ఇకపై అధిక రాబడి లభిస్తుంది. ఇక వడ్డీ రేట్లు ఎలా వున్నాయి అనేది చూస్తే.. 2 ఏళ్లకు పైన కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల ని పెంచింది.

ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 15 నుంచే అమలు లోకి వచ్చాయి. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇకపై 5.2 శాతం వడ్డీ వస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకి అయితే వడ్డీ రేటు 15 బేసిస్ పెరిగింది. దీనితో 5.45 శాతం వడ్డీ పొందొచ్చు. ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. దీంతో ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతానికి చేరింది. అయితే ఈ కొత్త వడ్డీ రేట్లు రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలకె పెంచింది.