లోన్ కట్టలేదని రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని వేధిస్తుంటే ఇలా చెయ్యండి…

-

మనలో చాలా మంది కూడా వివిధ రకాల లోన్స్ తీసుకొని వాటిని కట్టలేకపోతారు. అయితే ఈ నేపథ్యంలో లోన్ రికవరీ చేసేందుకు ఆయా బ్యాంకులు లేదా ఇతర ప్రైవేట్ సంస్థలు లోన్ రికవరీ ఏజెంట్లను లోన్ తీసుకున్న వ్యక్తి వద్దకు పంపిస్తాయి. కానీ లోన్ రికవరీ చేసేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు సగటు రుణ గ్రహీతను చాలా ఇబ్బందికి ఇబ్బంది పెడతాయి.ఇలా సాధారణంగా లోన్ రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను వేధిస్తున్నారని ఎప్పుడు మనం మీడియాలో చూస్తూ ఉంటాం. కొంతమంది రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఆత్మ హత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే రుణ ఎగవేత విషయంలో రుణగ్రహీతలకు కూడా చట్టపరమైన హక్కులు ఉంటాయని చాలా మందికి కూడా తెలియదు.

ప్రస్తుతం బ్యాంకులు మరియు నాన్-బ్యాంకు రుణదాతలు తమ కస్టమర్ బేస్‌ను విస్తృతం చేసుకునేందుకు రుణాన్ని చాలా సులభంగా అందిస్తున్నాయి. అయితే పెరుగుతున్న రుణాల నేపథ్యంలో నేపథ్యంలో ఆర్‌బీఐ కూడా రుణ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో రుణం చెల్లించే విషయంలో రుణగ్రహీతలకు ఉండే చట్టపరమైన హక్కుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో రుణాలనేవి సులభంగా లభిస్తుండడంతో డిఫాల్ట్‌ల కూడా సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రుణ వసూలుకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ఆర్బీఐ. అయితే రుణ ఎగవేతదారులను ఆర్థిక సంస్థల అనవసరమైన వేధింపులు, దుర్వినియోగ ప్రవర్తన నుంచి రక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ చట్టపరమైన హక్కులను కూడా ఇచ్చింది. ఒక రుణగ్రహీత డిఫాల్టర్‌గా మారడం అనేది ఉద్యోగ నష్టం లేదా ఇతర ఆర్థిక సమస్యల కారణమై ఉండవచ్చు. ఆర్‌బీఐ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి బ్యాంకులు ఇంకా ఇతర ఆర్థిక సంస్థల నుంచి వేధింపుల సంఘటనలను నివారించడానికి గైడ్లైన్స్ జారీ చేసింది.

ప్రత్యేకించి కోవిడ్ తరువాత ఆర్థిక సంస్థలు కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. అందుకే రుణాలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రికవరీ ఏజెంట్లు కస్టమర్ల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఉన్న చట్టపరమైన హక్కుల గురించి నిపుణుల సూచనలు ఏంటో తెలుసుకుందాం.రికవరీ ఏజెంట్లా వేధింపుల రుజువును చూపడానికి రికవరీ ఏజెంట్ నుంచి వచ్చే అన్ని కాల్‌లు, ఇమెయిల్‌లు ఇంకా మెసేజ్‌లను రికార్డ్ చేయాలి. ఇక ఈ సాక్ష్యాన్ని మీ రుణ అధికారికి లేదా రుణదాతకు సమర్పించాలి. ఆ వేధింపులు కొనసాగితే అన్ని వివరాలతో ఆర్‌బీఐకు మెయిల్ చేయడం మంచిది.

రుణాలు, అడ్వాన్సుల కోసం ఆర్‌బీఐకు సంబంధించిన సర్క్యులర్ మార్గదర్శక ఉల్లంఘనలు ఇంకా రికవరీ ఏజెంట్ల వేధింపుల గురించి ఫిర్యాదులను కచ్చితంగా పరిష్కరిస్తుంది. అప్పుడు అవన్నీ పరిశీలించి బ్యాంకులను ఆర్‌బీఐ నిషేధించే ఛాన్స్ ఉంది. పదేపదే ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే ఆర్‌బీఐ ఆ బ్యాంకులపై నిషేధాన్ని పొడిగించవచ్చు. రికవరీ ఏజెంట్ స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం ద్వారా లేదా మీ కార్యాలయంలో లేదా పరిసరాల్లో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తే మీరు బ్యాంక్, ఏజెంట్‌పై పరువు నష్టం దావా కూడా వేయవచ్చు.

ఇంకా అలాగే రికవరీ ఏజెంట్లు అనుమతి లేకుండా మీ ఆస్తిలోకి ప్రవేశిస్తే మీరు కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే ఇలాంటి వేధింపులు మీకు ఎక్కువైతే మీరు మొదట పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలి. పోలీసులు సహాయం చేయకపోతే లేదా మీ ఫిర్యాదును నమోదు చేయకపోతే అప్పుడు మీరు కోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news