సహజంగా జీవితంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. డబ్బు అవసరం ఉన్నప్పుడు అప్పు తీసుకోవడం సహజమే. ముఖ్యంగా, చాలా శాతం మంది పర్సనల్ లోన్ ను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. కాకపోతే, దానికి సంబంధించిన ఈఎంఐను చెల్లించడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని ఆర్థిక సంస్థలు మరియు నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఎంతో సులభంగా లోన్ లు ఇస్తూ ఉంటాయి. కాకపోతే, ఎప్పుడైతే ఈఎంఐనో తిరిగి చెల్లించరో, ఫోన్ చేసి మరీ లోన్ కు సంబందించిన ఈఎంఐను చెల్లించమని చెబుతూ ఉంటారు. దీంతో, ఆందోళన ఎక్కువ అవుతుంది. పైగా, పరిణామాలు కూడా ఎన్నో ఉంటాయి అనే చెప్పవచ్చు.
బ్యాంకులో లేక రుణ సంస్థల వద్ద ఎప్పుడైతే లోన్ తీసుకుంటారో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని మాత్రమే లోన్ తీసుకోవాలి. ఒక్క నెల సమయానికి ఈఎంఐ కట్టకపోతే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లోన్‌కు సంబంధించిన ఈఎంఐను ఒక్క నెల కట్టకపోయినా సరే, క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో, లోన్ రీపేమెంట్ తీరు మారుతుంది. పైగా, క్రెడిట్ అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే 90 రోజుల్లోపు ఈఎంఐను సరైన సమయంలో కట్టరో, చిన్న డిఫాల్ట్‌గా పరిగణించడం జరుగుతుంది.
దీంతో భవిష్యత్తులో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు అప్లికేషన్లకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. లోన్ ఈఎంఐకు సంబంధించిన పేమెంట్ సకాలంలో జరగకపోతే, రికవరీ కాల్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా, చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభిస్తారు. ముఖ్యంగా, రికవరీ ఏజెంట్లు ఇంటి వద్దకు వచ్చి, ఈఎంఐ పేమెంట్ చేయమని అడుగుతారు. ఈ ప్రక్రియ అంతా జరిగేసరికి, క్రెడిట్ స్కోర్ పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరియు రుణ అర్హత కూడా దెబ్బతింటుంది. దీంతో, కొత్త క్రెడిట్ కార్డును పొందడానికి కూడా కష్టమవుతుంది అనే చెప్పవచ్చు. కనుక ఈఎంఐను సకాలంలో చెల్లిస్తే, ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి.