తక్కువ వడ్డీకే LIC రుణాలు..!

చాలా మందికి సొంతిల్లు నిర్మించుకోవడం అనేది కల. మీరు కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారా..? మీరు సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మరి ఇలా ఫాలో అయ్యిపోతే మీ సొంతింటి కలని నెరవేర్చుకోచ్చు. అయితే ఇల్లుని నిర్మించడానికి సరిపడ డబ్బులు లేవా? అందుకని హోమ్ లోన్ తీసుకొని ఇంటి కల నేరవేర్చుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.

 

LIC
LIC

ఇక్కడ మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. మరి ఇక ఆలస్యం ఎందుకు దాని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…హోమ్ లోన్స్‌ పై స్పెషల్ ఆఫర్ ని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అందిస్తోంది. దీని ద్వారా మీరు డబ్బులు పొంది ఇల్లు పూర్తి చేసుకోచ్చు. పైగా వడ్డీ రేట్లు తగ్గిస్తోంది. అయితే ఈ బెనిఫిట్ కొందరికి మాత్రమే వర్తిస్తుంది గమనించండి.

ఈ హోమ్ లోన్స్ అనేది ఎలైసి సిబిల్ స్కోర్ ఆధారంగా ఇస్తోంది. సిబిల్ స్కోర్ బాగున్న వారికి తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ లభిస్తాయి. సిబిల్ స్కోర్ 700 లేదా ఆపైన ఉంటే.. వారికి వడ్డీ రేటు తగ్గుతుంది. ఒకవేళ కనుక సిబిల్ స్కోర్ 700 లేదా ఆపై ఉంటే హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి ప్రారంభమౌతుంది. రూ.50 లక్షల వరకు రుణాలకు ఇలా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రుణం అయితే ఏడు శాతంగా వుంది.