బిగ్ బ్రేకింగ్ : రేణిగుంట విమానాశ్రయం ప్రైవేటీక‌ర‌ణ‌..!

ప్రైవేటీక‌ర‌ణ‌కు పెద్ద పీట వేస్తున్న కేంద్రం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా తిరుప‌తి రేణిగుంట విమానాశ్ర‌యం ను కూడా ప్రైవేటీక‌రించాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. విమానాల స‌ర్వీసుల సంఖ్య త‌గ్గిపోవ‌డంతో ప్రైవేటీక‌రించాల‌నే నిర్ణ‌యం కేంద్రం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం త‌ర‌వాత ఎక్కువ మంది ప్ర‌యాణీకులు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండే ప్ర‌యాణాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

renigunta airport
renigunta airport

కేంద్రం మొత్తం దేశ వ్యాప్తంగా 13 విమానాశ్ర‌యాల‌ను ప్రైవేటిక‌రిస్తుండ‌గా వాటిలో తిరుప‌తి విమానాశ్ర‌యం కూడా ఉంద‌ని కేంద్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు ఇప్ప‌టికే కేంద్రం స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటు అప్ప‌గిస్తామని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాంతో కేంద్రానికి వ్య‌తిరేకంగా ఏపీలో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు రేణిగుంట విమానాశ్ర‌యం కూడా ప్ర‌వేటీక‌ర‌ణ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో నిర‌స‌న‌లు మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది.