స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెబుతోంది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ వీకేర్ సీనియర్ సిటిజన్స్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ గడువుని ఎక్స్టెండ్ చేసింది. దీనితో సీనియర్ సిటిజన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 2022 మార్చి 31 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని స్టేట్ బ్యాంక్ అంది. మాములుగా అయితే ఈ స్కీమ్ గడువు సెప్టెంబర్ 2020 వరకే ఉండేది.
కానీ కరోనా కారణంగా దీనిని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ఈసారి గడువుని పెంచింది. ఇది ఇలా ఉంటే సీనియర్ సిటిజన్లు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ ద్వారా చక్కటి లాభాలని పొందొచ్చు. వారి ఫిక్సిడ్ డిపాజిట్లపై సాధారణ పౌరుల కంటే 0.80 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. అయితే, నిర్ణీత వ్యవధిలో ఈ పథకంలో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం లభిస్తుంది.
ఇక ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకి ఎంత వడ్డీ వస్తుంది అనేది చూస్తే.. స్టేట్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన ఈ స్పెషల్ ఎఫ్‌డి స్కీమ్ కింద ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు డిపాజిట్ చేస్తే 30 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల వ్యవధి గల ఎఫ్డీపై కేవలం 5.4% వడ్డీ రేటు ఇస్తోంది. అదే, సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే, 6.20% వడ్డీ రేటు వస్తుంది. ఈ వడ్డీ రేట్లు 2021 జనవరి 8 నుండి వర్తిస్తాయి.