పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు భారీ షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 18 కోట్ల మంది ఖాతాదారుల డేటా లీక్ అయినట్టు తెలుస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఒక సర్వర్ సమస్య రావడం తో సూమరు ఏడు నెలల పాటు మొత్తం 18 కోట్ల పీఎన్ బీ వినియోగ దారుల వ్యక్తి గత, ఆర్థిక సమాచారం లీక్ అయినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ ఎక్స్ 9 తెలిపింది. పీఎన్‌బీ కి సంబంధించిన డిజిటల్ బ్యాకింగ్ వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్ చేసే విధంగా సర్వర్ లో సమస్య వచ్చినట్టు గుర్తించారు.
అయితే కొంత కీలక మైన సమాచారం మాత్రం లీక్ కాలేదని తెలిపింది. అయితే ప్రస్తుతం సమస్య ఉన్న సర్వర్ ను పూర్తి గా షట్ డౌన్ చేశారు. అయితే డేటా లీక్ లోపాన్ని గుర్తించిన తర్వాత సీఇఆర్‌టీ ఇన్, ఎన్‌సీఐఐపీసీ తో పీఎన్ బీ కి సమాచారం అందించామని సైబర్ ఎక్స్ 9 తెలిపింది. దీంతో పీఎన్‌బీ అప్రమత్తం అయి ఆ సమస్య ను పరిష్కరించారని తెలిపారు. అయితే ఈ డేటా లీక్ అంశం ప్రస్తుతం బ్యాకింగ్ వ్యవస్థ లో పెను సంచలనం గా మారింది.