టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు సంచారం అందుతోంది. ఢిల్లీవెల్లే ముందు అభ్యర్దులను ఖరారు చేశారు సిఎం కేసీఆర్. అంతే కాదు ఇప్పటీకె పలువురు అభ్యర్దులకు బీ ఫాం ఇచ్చారు కేసీఆర్. దీంతో రేపు, ఎల్లుండి నామినేషన్లు వేయనున్నారు పలువురు అభ్యర్దులు. ఏడుగురు సిట్టింగులకు నిరాశ కలిగినట్లు తెలుస్తోంది.. బీసీలకు 4, ఓసీలకు 7, ఎస్సీలకు 1 సీటు ఖరారు అయినట్లు సమాచారం.
నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత సీటు మరో మహిళకు కేటాయించినట్లు తెలుస్తోంది. రాజ్యసభకు కల్వకుంట్ల కవితను వెళ్లనున్నారని సమాచారం. ఆదిలాబాద్ నుంచి దండే విఠల్, మహబూబ్ నగర్ నుంచి సాయిచంద్, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి తాత మధు,
రంగారెడ్డి నుంచి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ నుంచి ఎం సి కోటిరెడ్డి.. మెదక్ నుంచి డాక్టర్ యాదవ రెడ్డి ఉన్నారు. కరీంనగర్ నుంచి ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు ఫైనల్ ఆయారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.