చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తత… మరోమారు తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధవిమానాలు..

చైనా, తైవాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. గతంలో మాదిరిగానే మరోసారి చైనా ఎయిర్ ఫోర్స్ యుద్ధవిమానాలు తైవాన్ గగనతలంలో ప్రవేశించాయి. రెండు అణు సామర్థ్య హెచ్ -6 బాంబార్లతో పాటు తొమ్మిది విమానాలు తైవాన్ ఎయిర్ ఢిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ లోకి ప్రవేశించాయని తైవాన్ ఆరోపించింది. తైవాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రకారం,యుద్ద విమానాలు తైవాన్ ద్వీపానికి దక్షిణంగా ప్రయాణించాయని తెలిపింది. రెండు హెచ్-6 బాంబర్లు ముందు ఫిలిప్పీన్స్ నుంచి తైవాన్ ను వేరు చేసే బాషి ఛానెల్‌లోకి వెళ్లాయి. ఇతర విమానాలు తైవాన్‌కు సమీపంలో కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే గత కొంత కాలం నుంచి చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తున్నాయి. చైనా, వన్ చైనా విధానంలో తైవాన్ మా దేశంలో అంతర్భాగమే అని చెబుతోంది. అయితే తైవాన్ మాత్రం చైనా అధికారాన్ని అంగీకరించడం లేదు. ఇటీవల అమెరికా, యూరోపియన్ యూనియన్ తైవాన్ కు మద్దతు నిలిచాయి. ఈ పరిణామం చైనాకు మింగుడు పడటం లేదు. 1949లో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత చైనా నుంచి తైవాన్ విడిపోయింది. అప్పటి నుండి స్వతంత్ర దేశంగా తైవాన్ ఉంది.