స్టేట్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం… వివరాలివే..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని తీసుకు రావడం జరిగింది. దీని పేరు SBI ప్లాటినం డిపాజిట్స్. అయితే ఇది టెంపరరీ ఆఫర్ మాత్రమే. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ ఆఫర్ సెప్టెంబర్ 14 న ముగుస్తుంది. ఇక ఎంత పొందుతారు అనేది చూస్తే..

 

SBI
SBI

7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య ఎఫ్‌డి ఉన్న సాధారణ కస్టమర్‌లకు ఎస్‌బిఐ 2.9 శాతం నుండి 5.4 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఈ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పొందుతారు. ఇది ఇలా ఉంటే సీనియర్ సిటిజన్లకు వారి FD లపై 5 సంవత్సరాల , అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి అదనంగా 30 bps వడ్డీ రేటును ఇస్తోంది.

ఇక ఈ ప్రత్యేక డిపాజిట్ల పథకం వలన కలిగే లాభాలు చూస్తే.. SBI ప్లాటినం డిపాజిట్ల కింద, కస్టమర్ 75 రోజులు, 525 రోజులు , 2250 రోజులకు స్థిరమైన డబ్బును పొందవచ్చు. అలానే కొత్త డిపాజిట్స్ కూడా చేసుకోచ్చు. NRE , NRO టర్మ్ డిపాజిట్‌లతో సహా (రూ .2 కోట్ల కంటే తక్కువ) దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్‌లు ఈ పథకాన్ని పొందవచ్చు.

అలానే SBI 75 రోజుల వ్యవధిలో సాధారణ ప్రజలకు 3.90 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. అదే సమయంలో, ప్రత్యేక డిపాజిట్ పథకం కింద ప్లాటినం 75 రోజుల వ్యవధిపై 3.95 శాతం వడ్డీని చెల్లించాలని ప్రతిపాదించబడింది. ప్రస్తుతం, బ్యాంక్ 525 రోజులు , 2250 రోజుల వ్యవధిలో సాధారణ ప్రజలకు 5 శాతం , 5.40 శాతం వడ్డీని ఇస్తోంది. అదే సమయంలో, ప్లాటినంపై 5.10 శాతం వడ్డీని 525 రోజులు , ప్లాటినం 2250 రోజులకు 5.55 శాతం చెల్లించాలని నిర్ణయించుకుంది.