డ్రగ్స్ ఓవర్ డోసు.. ప్రముఖ నటుడు మృతి

-

అమెరికా ప్రముఖ టెలివిజన్‌ షో దివైర్‌ సిరీస్‌ నటుడు మైఖేల్‌ కె విలియమ్స్‌ న్యూయార్క్‌ సిటీలో మృతి చెందారు. నటుడు మైఖేల్‌ కె విలియమ్స్‌ 54 సంవత్సరాలు ఉంటుంది. రెండు రోజులు గా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో… ఆయన ఆపార్ట్‌ మెంట్‌ కు వెళ్లారు చూశాడు మైఖేల్‌ స్నేహితుడు. ఈ నేపథ్యం లో ఆయన శవంగా కనిపించాడు.

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు మైఖేల్‌ స్నేహితుడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… మైఖేల్‌ ఎలా చనిపోయాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ అధికంగా తీసుకోవడం కారణంగానే విలియమ్స్‌ మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. 2002 నుంచి 2008 మధ్య అమెరికా కేబుల్‌ నెట్‌ వర్క్‌ అయిన హెచ్‌ బీఓ లో దివైర్‌ టెలివిజన్‌ సిరీస్‌ ప్రసారమైంది. డ్రగ్‌ డీలర్‌ పాత్రలో ఓమర్‌ లిటిల్‌ గా ఆయన ఒక్కసారిగా వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. లవ్‌ క్రాఫ్ట్‌ సిరీస్‌ లో విలియమ్స్‌ ఉత్తమ నటనతో 2021 ఎమ్మీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. ఇది ఇలా ఉండగా.. ఆయన మృతి పలువురు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news