పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

అవసరానికి డబ్బులు లేకపోతే చాలా మంది పర్సనల్ లోన్ తీసుకుంటారు. అయితే అన్ని బ్యాంకుల్లో పర్సనల్ లోన్ పై వడ్డీ ఒకేలా పడదు. బ్యాంకుని బట్టీ ఇది మారుతూ ఉంటుంది. అయితే మరి ఏ బ్యాంక్ లో పెర్సనల్ లోన్ పై ఎంత వడ్డీ పడుతోంది అనేది చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

banks
banks

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అయితే ఐదేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకోవడానికి 8.9% వడ్డీ చెల్లించాలి. ఇందులో మీ EMI రూ. 10,355 అవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అదే వడ్డీ రేటుతో లోన్స్ ని ఇస్తోంది.

ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు ఉంది. ఇది ఇలా ఉంటే ఇండియన్ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్ పై వడ్డీ రేటు 9.05 శాతం. దీని EMI రూ. 10,391కి వస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో అయితే పెర్సనల్ లోన్ పై సంవత్సరానికి 9.45 శాతం వడ్డీ రేటు ఉంటుంది.

బ్యాంక్ EMI రూ. 10,489 అవుతుంది. పంజాబ్ & సింధ్ బ్యాంక్, IDBI బ్యాంక్ లో వ్యక్తిగత రుణాలపై 9.5 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే.. ప్రతి నెలా రూ.10,501 ఈఎంఐ పడనుంది.