వెంటనే లోన్ రావాలా..? అయితే ఇలా సులువుగా సిబిల్ స్కోర్ ని పెంచుకోండి..!

-

క్రెడిట్ స్కోర్ ఎంత ముఖ్యమో మనకి తెలుసు. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే లోన్ వస్తుంది చాలా మంది రకరకాల అవసరాల కోసం లోన్స్ తీసుకుంటుంటారు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు నుంచి లోన్ తీసుకోవాలంటే ముందు ఆ కంపెనీలు కస్టమర్లకు క్రెడిట్ స్కోర్ ని చూస్తాయి. లోన్ పొందడానికి ఇది బేసిక్ రూల్. లోన్ ఇచ్చిన తర్వాత తిరిగి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఈజీగా లోన్ వస్తుంది. క్రెడిట్ స్కోర్ 300 నుంచి మొదలవుతుంది 900 వరకు పెరుగుతుంది. ట్రాన్సాక్షన్ హిస్టరీ లోన్ తీసుకునే ప్రాసెస్ లోన్ పేమెంట్స్ హిస్టరీ పదవీకాలం ఇలా వీటి ఆధారంగా క్రెడిట్ స్కోర్ ని లెక్కబెడతారు.

క్రెడిట్ బ్యూరోలు వినియోగదారుల ఆర్థిక కార్యకలాపాల నుంచి సమాచారాన్ని సేకరిస్తాయి. అయితే అసలు క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యమైనది అనేది ఇప్పుడు చూద్దాం.. క్రెడిట్ స్కోర్ బాగుంటే తక్కువ వడ్డీ రుణాలకు దారితీస్తుంది. క్రెడిట్ కార్డ్ పరిమితులు, అద్దె ఆమోదాలు లేదంటే బీమా ప్రీమియం వంటి వాటిని ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. బ్యాంకులో 700 కంటే ఎక్కువ స్కోరు ఉంటే మంచిదని చూస్తారు దీనివలన రుణగ్రహతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.

ఈఎంఐ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలను గడువు తేదీకి ముందే చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడదు. ఈఎంఐ లేదా బ్యాలెన్స్ పూర్తిగా కట్టేయాలి. క్రెడిట్ కార్డ్ పరిమితిలో 30% లేదా అంతకంటే తక్కువ ఉపయోగించడం క్రెడిట్ కార్డ్ ని మెరుగుపరుస్తుంది. కచ్చితంగా అవసరమైతే మాత్రమే కొత్త క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. చాలా అప్లికేషన్లు స్వల్పకాలిక క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version