సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. “ఇండియాలో తొలిసారిగా కంప్యూటర్ సేవలు Tata Institute of Fundamental Research Automatic Calculator (TIFRAC) వారు 1956లో ప్రారంభించారు. రాజీవ్ గాంధీ కి అప్పుడు 12 సంవత్సరాలు. ఎదో నోటికొచ్చింది వాగడం, ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకమ్మాచిట్టి.. నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్ వీటికి పరిమితం అయితే మంచిదమ్మా ” అంటూ X వేదికగా పోస్ట్ చేశారు కేటీఆర్.
దీనికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అదే స్తానానికి ప్రజలు మిమ్మల్ని పంపుతున్నారని X వేదికగా పోస్ట్ చేశారు. ” ముఖ్యంగా రాజీవ్ గాంధీ వారసత్వం కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు. అతడు ప్రతీ భారతీయుడు. తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నారని రాజీవ్ గాంధీ శాశ్వత నిదర్శనం” అని ట్వీట్ చేశారు మహేష్ కుమార్ గౌడ్.