ఎక్కడ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద ఎక్కువ వడ్డీ వస్తుందంటే..?

-

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తూనే వుంటారు. అయితే వడ్డీ రేట్లను బట్టీ మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఎక్కువ వడ్డీ ఎక్కడ వస్తుందో చూసి ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు మనకొస్తాయి. ఆర్బీఐ రెపో రేటును వరుసగా మూడో సారి పెంచింది.

దీనితో బ్యాంకులు సైతం ఎఫ్‌డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. పోస్టాఫీసులు ఎక్కువ వడ్డీ రేటుని ఇస్తున్నాయి. అయితే మరి ఎక్కువ వడ్డీ రేటు ఎక్కడ వస్తుందో చూద్దాం.

స్టేట్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 13 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక వాటి వివరాలను చూస్తే.. 7 నుంచి 45 రోజుల కి 2.90%, 46-179 రోజుల వ‌ర‌కు 3.90%, 180- 210 రోజుల వ‌ర‌కు 4.55%, 211 రోజుల నుంచి ఏడాదిలోపు అయితే 4.60%, ఏడాది నుంచి రెండేళ్లలోపు 5.45%, రెండేళ్లు నుండి మూడేళ్ల లోపు 5.50%, మూడేళ్లు నుండి ఐదేళ్ల లోపు 5.60% ఉండగా ఐదేళ్లు నుండి ప‌దేళ్ల లోపు 5.65% గా వుంది.

అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే‌ 7-15 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ 2.75% ఉండగా 15-29 రోజులు 2.75%, 30-45 రోజులు 3.25%, 46-60 రోజులు 3.25%, 61-89 రోజులు 3.25%, 90 రోజులు నుండి 6నెలలు 3.75% వుంది. 6నెలల ఒక రోజు నుండి 9నెలలు అయితే 4.65% వుంది. 9 నెలల ఒక రోజు నుండి సంవత్సరం లోపు 4.65%, సంవత్సరం కి 5.50%, సంవత్సరం ఒక రోజు నుండి రెండేళ్లు 5.50%, రెండేళ్ల ఒక రోజు నుండి మూడేళ్లు 5.50%, మూడేళ్లు నుండి ఐదేళ్లుకి 6.10%, ఐదేళ్ల ఒక రోజు నుండి పదేళ్లుకి 5.75% వుంది.

అదే పోస్టాఫీసులో చూస్తే.. 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ చేస్తే గరిష్టంగా 6.7% వడ్డీని ఇస్తోంది. అదే 1 నుంచి 3 సంవత్సరాలకి అయితే 5.5% వడ్డీ వస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version