Yes Bank కొత్త పథకంని తీసుకు వచ్చింది. Yes Bank ఎంఎస్ఎంఇలకు రూ.5 కోట్ల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇవ్వాలని అనుకుంటోంది. కనుక ఏ హామీ లేకుండా 5 కోట్ల రుణం పొందాలంటే ఇదే మంచి సమయం. డబ్బులని కూడా సులభంగా, తక్కువ సమయంలో పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. MSME లకు వ్యాపారం మరియు వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి, కొత్త వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి దీనిని తీసుకు వచ్చినట్టు అంది.
ఈ MSME రుణాల పథకం ద్వారా MSME వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి, వేగాన్ని కొనసాగించడానికి వృద్ధిని వేగవంతం చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అందుకు రుణాలు, డిపాజిట్లు, బీమా, డిజిటల్ సొల్యూషన్స్‌పై దృష్టి పెట్టింది బ్యాంక్. ఈ ఎంఎస్‌ఎంఇ కింద స్టార్టప్‌లు ఎటువంటి హామీ లేకుండా రూ .5 కోట్ల వరకు రుణ సౌకర్యం పొందవచ్చు. అయితే దీనిని పొందాలంటే ఎంఎస్‌ఎంఇల కోసం బ్యాంక్ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది ఇలా ఉంటే ముందస్తుగా ఆమోదించబడిన వాణిజ్య క్రెడిట్ కార్డులు, సలహా మరియు సంపద నిర్వహణ పరిష్కారాలతో సహా ఇతర సౌకర్యాలను కూడా బ్యాంక్ అందిస్తుంది. అలానే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఇసిఎల్‌జిఎస్) కింద ఎంఎస్‌ఎంఇలకు రూ .15,571 కోట్ల అదనపు రుణాన్ని బ్యాంకులు ఆమోదించాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.