బ్యాంకు ఉద్యోగులకు షాక్‌..ఏపీలో నేడు పనిచేయనున్న బ్యాంకులు

ఆంధ్ర ప్రదేశ్‌ లోని పని చేస్తున్న బ్యాంకు ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేవ్‌ లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల కార్య కలాపాలు ఇవాళ యథావిధిగా కొనసాగనున్నాయి. నిజానికి ఈ రోజు సంక్రాంతి పండుగ అయినప్పటికీ.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి సంక్రాంతి పండుగ సెలవును ఒక రోజు ముందుగానే జరిపింది.

banks
banks

ఈ నెల 13 వ తేదీన భోగి, 14 వ తేదీన సంక్రాంతి అని జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ ఇటీవల ప్రకటించి.. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లోని బ్యాంకులు నిన్న మూతపడ్డాయి. దాని ఫలితంగా ఇవాళ అన్ని ప్రభుత్వం, ప్రైవేటు బ్యాంకులు నేడు యథావిధిగా పని చేస్తాయని బ్యాంకు అధికారులు ప్రకటన చేశారు. ఇక దీనిని ఖతాదారులు, వినియోగ దారులు, ఇతరులు బ్యాంకు కు సంబంధించిన కార్యకలాపాలను, ఇతర సేవలను సద్వినియోగం చేసుకోవాలని… బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు.