సీపీఎల్ టీ20.. సెయింట్ కిట్స్‌పై ట్రైడెంట్స్ గెలుపు..

-

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్‌) టీ20 2వ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ జ‌ట్టుపై బార్బ‌డోస్ ట్రైడెంట్స్ జ‌ట్టు 6 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ముందుగా సెయింట్ కిట్స్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. ట్రైడెంట్స్ జ‌ట్టు బ్యాటింగ్ చేప‌ట్టింది.

barbados tridents won by 6 runs against sait kitts in cpl 2020 2nd match

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ట్రైడెంట్స్ జ‌ట్టు 9 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టులో జేస‌న్ హోల్డ‌ర్ (22 బంతుల్లో 38 ప‌రుగులు, 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), కేఆర్ మ‌య‌ర్స్ (20 బంతుల్లో 37 ప‌రుగులు, 2 ఫోర్లు, సిక్స‌ర్లు)లు రాణించారు. సెయింట్ కిట్స్ బౌల‌ర్లు సోహైల్ త‌న్వీర్‌, షెల్డాన్ కాట్రెల్‌, ఎమ్రిట్‌ల‌కు త‌లా 2 వికెట్లు ద‌క్కాయి. జోసెఫ్‌, సోధిలు చెరొక వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన సెయింట్ కిట్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టులో సిల్వా (41 బంతుల్లో 41 ప‌రుగులు, 3 ఫోర్లు), డంక్ (21 బంతుల్లో 34 ప‌రుగులు, 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) లు రాణించినా జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చ‌లేక‌పోయారు. ఇక ట్రైడెంట్స్ బౌల‌ర్ల‌లో శాన్ట‌న‌ర్‌, ర‌షీద్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news