నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే కరోనా మహమ్మారి తీవ్రమవుతున్న నేపధ్యంలో కళాశాలలు, పాఠశాలల ప్రారంభంపై మంత్రిమండలి సభ్యులు తమ అభిప్రాయాలను ఈ కేబినెట్ సమావేశంలో తెలుసుకోనున్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో ప్రధానంగా వైఎస్‌ఆర్ ఆసరా పథకంపై చర్చించనున్నారు.
ఇది అమల్లోకి వస్తే నాలుగేళ్లలో 27వేల కోట్లకు పైగా డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరుతుంది. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే వచ్చే సెప్టంబరు 5వ తేదీన ఇవ్వనున్న వైఎస్సార్ విద్యాకానుకకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే రాజధాని తరలింపు ప్రక్రియపై కూడా నేడు కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది అని సమాచారం.