బ్రేకింగ్: ఆన్లైన్ ఫార్మసీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు…!

-

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆన్‌లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్‌లో 6.2 బిలియన్ రూపాయల ( 83.08 మిలియన్ డాలర్లు) షేర్ ని కొనుగోలు చేసింది. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ ఇంక్ భారతదేశంలో ఆన్‌లైన్ ఔషధ అమ్మకాల సర్వీస్ ని కొద్ది రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. వైటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 60% హోల్డింగ్‌ ను తాము కలిగి ఉన్నామని రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.

నెట్‌మెడ్స్ , వైటాలిక్ మరియు దాని అనుబంధ సంస్థలు 2015 లో విలీనం చేసారు. నెట్‌మెడ్స్ అనేది లైసెన్స్ పొందిన ఇ-ఫార్మా పోర్టల్. వైద్యులు సూచించిన మందులతో పాటుగా భారత్ లో లభించే అన్ని రకాల మందులను ఉత్పత్తి చేస్తుందని రిలయన్స్ పేర్కొంది. ఈ సంస్థలో తాము పెట్టుబడులు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news