కేసీఆర్ సమావేశానికి కాంగ్రెస్ కీలక నేత..!

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న దళిత బంధు సమావేశానికి కాంగ్రెస్ కీలక నేత భట్టి విక్రమార్క హాజరవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి తాను హాజరవుతున్నట్టు భట్టి వెల్లడించారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం లో కూడా దళిత బంధు అమలు చేస్తున్నారని దాంతో స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించారని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

దాంతో కాంగ్రెస్ తరపున ఉన్న డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతా అని తెలిపారు. సమావేశం లో ఏయే అంశాలను ప్రస్తావించాలి అనే దానిపై తమ పార్టీ నాయకులతో చర్చించామని చెప్పారు. ఇక బట్టి కేసీఆర్ సమావేశానికి హాజరు అవ్వడం పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇదివరకు కేసీఆర్ అఖిల పక్ష సమావేశానికి హాజరైన పలువురు కాంగ్రెస్ నేతలపై విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంది.