కాంగ్రెస్ సీనియర్ నేత మరియు కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్… ఇవాళ అ మృతి చెందారు. మంగళూరు లో ఆయన తుది శ్వాస విడిచారు. 81 ఏళ్ల ఆస్కార్ ఫెర్నాండేజ్ ఈ ఏడాది జులై లో ఇంట్లో యోగా చేస్తుండగా కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఈ నేపథ్యంలో ని ఆయనను ఐసియు లో చేర్చారు.
గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు ఆయనకు సర్జరీ నిర్వహించారు వైద్యులు. అక్క అప్పటి నుంచి ఆయన మంగుళూరులోని ఆస్పత్రిలో ఐసీసీ లోనే ఉన్నారు. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో ఇవాళ మృత్యువుతో పోరాటం చేస్తూ మృతి చెందారు. ఆయనకు భార్య ఫెర్నాండెజ్ మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన ఓ విజన్ ఉన్న నాయకుడు అని.. అలాంటి నేతను కోల్పోవడం చాలా దురదృష్టకరమని ప్రముఖులు తెలిపారు.