సీఎం కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. ఏమన్నారంటే..!

-

హైదరాబాద్: కేసీఆర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరగుతున్న దాడులను సీఎంకు వివరించామన్నారు. ఎస్సీ మహిళ మరియమ్మ పోలీస్ లాకప్‌లో దారుణంగా చనిపోయిన విషయాన్ని కేసీఆర్  దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశామన్నారు.

మరియమ్మ కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరామని భట్టి తెలిపారు.. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని కేసీఆర్‌కు సూచించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీలు, గిరిజనులను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వంపై ఉందని భట్టి విక్రమార్క అన్నారు. మరియమ్మ కుటుంబానికి రూ. 15 లక్షలు ఇస్తామని కేసీఆర్ చెప్పినట్లు భట్టి తెలిపారు. మరియమ్మ కుమార్తెలను కూడా ఆదుకుంటామని సీఎం చెప్పినట్లు భట్టి పేర్కొన్నారు. మరియమ్మకు ఇల్లు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

 

కాగా కేసీఆర్‌తో భేటీకి ముందు గవర్నర్‌‌ను కూడా కాంగ్రెస్ నేతలు కలిశారు. మరియమ్మ లాకప్ డెత్‌పై తమిళిసైకు వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళితులపై దాడులు ఆపాలని కోరారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో నిందితులను కాపాడేందుకు ప్రభుత్విస్తోందని ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొందరు పోలీస్ శాఖకు మచ్చతెచ్చేలా పని చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారికి గుణపాఠం చెబుతామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news