నానబెట్టిన అంజీర్ తింటే పురుషుల్లో ఈ సమస్యలు వుండవు..!

-

అంజీర్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎన్నో సమస్యల్ని అంజీర్ తరిమికొడుతుంది. అంజీర్ వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నానబెట్టిన అంజీర్ ని తినడం వల్ల మంచి ఫలితాలు కనబడతాయని ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం.

అంజీర్

ఎవరైతే ఎక్కువ నీరసంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు అంజీర్ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని.. నీరసం ఉండదని ఆయుర్వేద డాక్టర్ చెప్తున్నారు. అదే విధంగా ఇతర అనారోగ్య సమస్యలు ఉండి కూడా పరిష్కారం చూపిస్తుంది.

అంజీర్ లో ఐరన్, క్యాల్షియం, విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం, ప్రొటీన్ సమృద్ధిగా ఉంటాయి. అలానే వాటితో పాటుగా కార్బోహైడ్రేట్స్, ఫైబర్, క్యాలరీస్ కూడా ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు నాలుగు అంజీర్ ని నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది.

అంజీర్ వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి..?

హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుతుంది:

అంజీర్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.

ఎనర్జీ వస్తుంది:

అంజిర్ లో విటమిన్స్, సల్ఫర్, క్లోరిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎనర్జీని ఇస్తుంది. నీరసం తగ్గిస్తుంది. అంజీర్ లో మెగ్నీషియం, జింక్, మాంగనీస్ ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అదే విధంగా నీరసం వంటి సమస్యలు కూడా దూరం అయిపోతాయి.

పురుషుల ఆరోగ్యానికి:

ఇంఫెర్టిలిటీ సమస్యలు రాకుండా ఫెర్టిలిటీ ని ఇంప్రూవ్ చేస్తుంది. వీటిని పురుషులు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. వీటిలో విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. కనుక ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరి చేరకుండా చూసుకుంటుంది కావాలంటే పురుషులు అంజీర్ ని పాలతో తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news