బీఈ, బీటెక్‌ అర్హతతో ఇర్కాన్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు… ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ లో ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేయచ్చు. దీనిలో మొత్తం 29 ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

jobs
jobs

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎర్త్‌ వర్క్‌, సివిల్, జనరల్, లీగల్, ఎస్ అండ్‌ టీ తదితర విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టుల వివరాల లోకి వెళితే.. మేనేజర్ మొత్తం ఖాళీల సంఖ్య 24 వున్నాయి. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎల్‌ఎల్‌బీ/బీఈ/బీటెక్‌ లో ఉత్తీర్ణత అయిన వారు దీనికి అర్హులు. అలానే అనుభవం కూడా తప్పని సరిగా ఉండాలి. అలానే టెక్నికల్‌ నాలెడ్జ్‌ కూడా అవసరం. అభ్యర్ధుల వయసు 50 ఏళ్లు మించరాదు. ఎర్త్‌ వర్క్‌, సివిల్, జనరల్, లీగల్, ఎస్ అండ్‌ టీ తదితర వాటిల్లో ఖాళీలున్నాయి.

అలానే సీనియర్‌ వర్క్‌ ఇంజనీర్‌ రెండు పోస్టులున్నాయి. 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్‌లో ప్యాస్ అయిన వారు అర్హులు. పని లో అనుభవం కూడా ఉండాలి. వయసు 35 ఏళ్లు మించరాదు. అదే విధంగా సేఫ్టీ ఇంజనీర్‌ ఖాళీలు 2 వున్నాయి. గ్రాడ్యుయేషన్‌ తో పాటు హెల్త్‌ అండ్‌ సేఫ్టీ విభాగాల్లో పీజీ డిప్లొమా ప్యాస్ అయ్యి ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించరాదు.

సీనియర్‌ వర్క్స్ ఇంజనీర్‌ 1 ఖాళీ ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. పనిలో అనుభవం కూడా ఉండాలి. వయసు 35 ఏళ్లు మించరాదు. నెలకు రూ.40,000ల వరకు జీతం ఇస్తారు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 30, 2022. సంబంధిత రాష్ర్టాల్లోని ఇర్కాన్‌ గ్రూప్‌ జోనల్‌ కార్యాలయాలకు దరఖాస్తులు పంపవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news