ప్రైవేటు యాప్‌లలో లోన్లకు అప్లై చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

-

ఈరోజుల్లో కొత్త రకాల మోసాలు ఎన్నో చూస్తున్నాము. ముఖ్యంగా ఇంటర్నెట్ లో మోసాలు పెరిగిపోయాయి ఇండియాలో డిజిటల్ లెండింగ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది కొత్తతరం సింటెక్స్ స్టార్ట్ అప్ లో పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. వినియోగదారులకు బాగా ఎక్కువ లోన్స్ ఇస్తున్నాయి. అలానే బ్యాంకింగ్ సంస్థలతో పాటుగా ఇవి పోటీ పడుతున్నాయి. ఫిన్ టెక్ సంస్థలు ద్వారా ఈజీగా లోన్ ని పొందచ్చని చాలామంది బ్యాంకులకి బదులుగా ఈ యాప్ లను ఆశ్రయిస్తున్నారు కానీ నకిలీ బెడద బాగా ఎక్కువైపోయింది. చట్టబద్ధంగా ఏర్పడిన వాటి పనితీరు బాగానే వున్నా నకిలీ యాప్లతో వినియోగదారులు రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకి అందుబాటులో వెయ్యికి పైగా యాప్లు ఉన్నాయి దాదాపు 600 కి పైగా చట్ట విరుద్ధమైనవి అని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ కమిటీ గుర్తించింది. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు ఈ యాప్లలో తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. లోన్ తీసుకునే ముందు రుణదాత ప్రొఫైల్ ని చెక్ చేయడం చాలా అవసరం.

బాగా ఫేమ్ ఉన్న వెబ్సైట్లోనే లోన్లు తీసుకోండి ఎక్కడపడితే అక్కడ తీసుకోవద్దు. లోన్ తీసుకునే ముందు రూల్స్ షరతులు వంటివి చూసుకోండి. గుడ్డిగా లోని తీసుకుంటే మీకే ప్రమాదం ప్రైవసీ విషయాలను అసలు మర్చిపోకండి. అలానే డిజిటల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి క్రెడిట్ చెక్ అవసరమవుతుంది అది మీకు క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. ప్రతి క్రెడిట్ మీ క్రెడిట్ రివార్డ్ ను ప్రభావితం చేస్తుంది సో ఎప్పుడైనా ఇలా లోన్ తీసుకునే ముందు కచ్చితంగా వీటిని చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news