ఫూటుగా తాగి రోడ్డుపైకొచ్చాడు. కనిపించిన ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను నడిరోడ్డుపై వివస్రను చేశాడు. ఇదంతా చుట్టుపక్కల ఉన్న వారు చోద్యం చూసినట్టు చూస్తున్నారు కానీ పట్టించుకోలేదు. పైపెచ్చు సెల్ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. ఈ ఘటన హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి బాలాజీనగర్‌లో జరిగింది.
జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య(30) కూలీ. ఫూటుగా తాగిన మారయ్య.. ఆదివారం రాత్రి 8.30కు తల్లితో కలిసి బాలాజీనగర్ బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో స్థానిక యువతి (28) దుకాణం నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను చూసిన మారయ్య ఆమెపై చెయ్యివేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కోప్పడిన యువతి దూరంగా నెట్టేసింది. విచక్షణ కోల్పోయిన మారయ్య.. ఆమెపై దాడి చేసి బలవంతంగా ఆమె దుస్తులను చించి లాగేశాడు.
పక్కన ఉన్న మారయ్య తల్లి కనీసం అడ్డుకోలేదు. అటు నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించడంతో ఆమెపైనా దాడికి ప్రయత్నించాడు. అతను వెళ్లాక కొందరు వచ్చి ఆమెను కవర్లతో కప్పేసి జవహర్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు.