పండగల టైంలో జాగ్రత్త : తెలంగాణా హెల్త్ డైరెక్టర్

-

గత వారం రోజులుగా పడుతున్న వర్షాలు పడుతున్నాయని తెలంగాణా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు అన్నారు. గ్రేటర్ లో ఆరోగ్య శాఖ కూడా పని చేస్తోందని, నీళ్లు, ఆహారం, దోమల వల్ల వచ్చే జబ్బులు అరికట్టడానికి కృషి చేస్తున్నామని అన్నారు. మంత్రి ఈటల, కేటీఆర్ ఆదేశాల మేరకు 182 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసామని, 14 వేల మందికి ట్రీట్మెంట్ అందించామని అన్నారు. 10 వేల మాస్క్ లు అందించామని, 18 మంది డాక్టర్స్ శిబిరాలలో పని చేస్తున్నారని ఆయన అన్నారు.

నర్సులు, 142 సపోర్టింగ్ స్టాఫ్ వర్క్ చేస్తున్నారని, 67 సంచార వాహనాలు ఏర్పాటు చేసామని అన్నారు. కలరా , టైఫాయిడ్, జండిస్ వంటి రోగాలు ఎక్కువగా వస్తాయని, నీటిని కాచి తాగండి, వేడి ఫుడ్ తీసుకోండని కోరారు. పండగ ముఖ్యమే కానీ అంతకంటే ప్రాణం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. జాగ్రత్తలు పాటించండి – పండగ చేసుకోండి అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news