అమెరికా ఎన్నికల్లో హీట్‌ పుట్టించిన న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం…!

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు సంబంధించి న్యూయార్క్‌ పోస్ట్‌లో వచ్చిన కథనం కలకలం రేపింది. అయితే, దీనికి సంబంధించిన లింక్‌లను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లు బ్లాక్‌ చేయడంపై అధ్యక్షుడు ట్రంప్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, హ్యాకింగ్‌ కథనాలపై తాము స్పందించే వైఖరిలో మార్పులు చేసింది ట్విట్టర్‌.

డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌, ఆయన కుమారుడు హంటర్ నిర్వహిస్తున్న వ్యాపారాల్లో అవినీతి లావాదేవీలు జరిగాయంటూ ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ప్రచురించిన కథనం కలకలం రేపింది. హంటర్‌ ఈ మెయిల్‌లోని సమాచారాన్ని ఇందుకు ఆధారంగా తీసుకున్నట్టు న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది. హంటర్‌కు చెందిన పాత కంప్యూటర్‌ను హ్యాక్‌ చేయటం ద్వారా లభించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. నిర్ధారణ కాని ఆ ఖాతాలో సమాచారం ప్రామాణికం కాదని.. పలు విమర్శలు రావడంతో, ఫేస్ బుక్, ట్విటర్ ఈ వార్తకు సంబంధించిన లింకులను బ్లాక్ చేశాయి. ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు.హ్యాకింగ్‌ కథనాలపై తాము స్పందించే వైఖరిలో మార్పులు చేస్తూ ట్విటర్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపంలో ఉన్న తరుణంలో ఈ చర్య ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news