హిందువులు ప్రధానంగా జరుపుకునే పండుగలలో మహా శివరాత్రి కూడా ఒకటి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున శివరాత్రి జరుపుకుంటాము. సాధారణంగా ఏ పండుగ అయినా సరే పగటిపూట జరుపుతారు.
కానీ శివరాత్రిని మాత్రం రాత్రి పూట జరుపుతారు. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు చేయడం, భజనలు చేయడం జరుగుతుంది. అలానే శివుడు అనుగ్రహం కలగాలని భక్తులు నిద్రపోకుండా జాగరణ చేస్తారు. అయితే శివరాత్రి రోజు తప్పకుండా పాటించాల్సిన మూడు విషయాలు ఇప్పుడు చూద్దాం.
మహా శివరాత్రి నాడు ఉపవాసం:
మహా శివరాత్రినాడు ఉపవాసం చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శివరాత్రి రోజు తప్పనిసరిగా ఉపవాసం చేస్తే మంచిది.
జాగరణ:
శివరాత్రి నాడు నిద్రపోకుండా జాగరణ చేస్తే కూడా చాలా మంచిది. చాలా మంది శివుని ఆలయాల్లో శివరాత్రి రోజు భజన చేసి, కీర్తనలు పాడి జాగరణ చేస్తూ ఉంటారు.
శివనామస్మరణతో అభిషేకాలు:
మహాశివ రాత్రి నాడు శివునికి అభిషేకం చేస్తే కూడా మంచిది. జలంతో, ఆవుపాలతో, పంచామృతంతో, వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వ పత్రాలు శివుడికి ఎంతో ప్రీతి అయిన తుమ్మి పూలను, గోగుపూలను, తెల్లని పచ్చని పూలతో శివ నామాలను కానీ పంచాక్షరీ మంత్రమైన ఓం నమశ్శివాయ కానీ స్మరించుకుంటూ పూజించాలి.
తాంబూలంగా శివుడికి చిలకడదుంప, అరటి పండు, జామ పండు, ఖర్జూరం పండు సమర్పించాలి. ఇలా శివరాత్రి నాడు ఈ విధంగా అనుసరిస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు.