మీరు ఏదైనా బిజినెస్ ని చేయాలనుకుంటున్నారా..? ఏ బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అవ్వాలి అంటే మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది. కేవలం మీ వద్ద ఉంటే ఫోన్ తో అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి అవుతుంది.
మరి ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ మధ్య కాలంలో డిజిటల్ ఫోటోగ్రఫీ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. కనుక ఫోటోలు తీసి మీరు డబ్బులు సంపాదించవచ్చు. పైగా ఇలా మీరు తీసే ఫోటోలు కి మంచి రేటు కూడా వస్తుంది. ఇలా కేవలం మీరు ఫోటోలు తీసి డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఇవి కొంచెం ప్రత్యేకంగా ఉండాలి.
ఈ బిజినెస్ చేయాలంటే మీరేం పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అయ్యుండి మీకు మంచిగా ఫోటోలు తీయడం వస్తే సరిపోతుంది. ఫోటోలును విక్రయించడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. పలు కంపెనీలు మీ ఫోటోలని కొనుగోలు చేస్తాయి. అయితే ఈ ఫోటోలని వెబ్ సైట్ వాళ్ళు కొనుగోలు చేయాలంటే దీని కంటే ముందు వెబ్సైట్లలో మీరు ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత వాటిని కంపెనీల వెబ్సైట్లలో పెట్టాలి. మీ ఫోటోలును కనుక యూజర్స్ డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. ఎంత ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుంటే డబ్బులు అంత బాగా వస్తాయి. అడాబ్ స్టాక్, షట్టర్ స్టాక్, అలమి, ఇట్సీ, ఫోటోమోటో, క్రెస్టాక్, 500పీఎక్స్ వంటి వాటిల్లో ఫోటోలు విక్రయించవచ్చు.