Get Ready : ఇవాళ 5 గంటలకు “బీస్ట్” తెలుగు ట్రైలర్ రిలీజ్

-

త‌మిళ స్టార్ హీరో విజ‌య్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే క‌లిసి న‌టించిన సినిమా బీస్ట్. ఈ సినిమా విడుద‌లకు ముందే రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. ఇటీవ‌ల విడుద‌ల త‌మిళ వ‌ర్షన్ ట్రైల‌ర్ కూడా దూసుకుపోతుంది. కాగ ఈ బీస్ట్ సినిమా నుంచి అర‌బిక్ కుత్తు అనే సాంగ్ ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల అయిన విషయం తెలిసిందే. ఈ అర‌బిక్ కుత్త సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాట అతి త‌క్కువ కాలంలోనే 264 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఈ పాట త‌మిళ వ‌ర్షన్ లో ఉన్నా.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఇక ఈ సినిమాలో విజయ్ సోల్జర్ గా కనిపించ బోతున్నారు. ట్రైలర్ మొదలవ్వడమే ఓ హైజాక్ సిచ్యువేషన్ తో ప్రారంభం అవుతుంది. విజయ్ సూపర్ యాక్షన్, స్టైలిష్ ఫెర్ఫామెన్స్ సినిమాపై మరింతగా హైప్ పెంచుతున్నాయి.

ఫైటింగ్ సీన్లలో విజయ్ అదరగొట్టాడు. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందనే భారీ అంచనాలను పెంచింది ట్రైలర్. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ తెలుగు ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news