దేశంలో దారుణాలు అంతకంతకు పెరిగి పోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే మరొకరు అండగా నిలవాల్సిన బంధువులే అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. అయితే తాజాగా కరీంనగర్ జిల్లాలో 29 ఏళ్ల యువకుడు… 69 సంవత్సరాల వృద్ధురాలి పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాలో అయిలేష్ అనే యువకుడు.. బట్టల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల తమ బంధువుల వివాహ నేపథ్యంలో… కరీంనగర్ జిల్లాలోని కోహెడ అనే గ్రామానికి వెళ్ళాడు.
అక్కడ పీకలదాకా తాగి… పక్కింటి వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కామ వాంఛను తీర్చుకునేందుకు… వయసుతో సంబంధం లేకుండా… ఆ వృద్ధురాలిపై చెలరేగిపోయాడు. అయితే ఆ మహిళ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని.. ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అయిలేష్ కోసం… కోహెడ మండల పోలీసులు గాలింపు చేస్తున్నారు.