బ్యూటీ స్పీక్స్ : ప్రియ‌మైన నీకు..అందాల స్నేహ‌కు…

-

మాటలు కొన్ని
మౌనాలు కొన్ని
మాయ‌లు చేస్తాయి
మ‌హేంద్ర‌జాలం చేస్తాయి
అందాల తార‌ల న‌వ్వులు
మాట‌లు చూపులు
గారడి చేస్తాయి
అంత‌టి సంద‌డిచేసిన స్నేహ
ఎక్కడున్నారో…
బిడ్డ‌ల‌తో సంద‌డి చేస్తూ మొన్న‌టి వేళ
సోష‌ల్ మీడియాలో క‌నిపించారు
క‌నుక బ్యూటీ స్పీక్స్
అందంతో పాటు అభిన‌యం కూడా మాట్లాడితే
స్నేహ అని రాయ‌డం లో స‌మ‌ర్థింపు కాదు
సహేతుకత కూడా ఉంది…
మ‌ళ్లీ పాడుకోండి అనుకుంటూ త‌న చుట్టూమ‌ది తిరిగింద‌ని!

మ‌న‌సును ఉన్న‌ది చెప్పాల‌నున్న‌ది మాట‌లు రావే ఎలా? అన్న పాట వ‌చ్చి ఎంత కాలం అయింది.. ప్రేమ అంటేనే తీయని బాధ అని,లేత గుండెల్లో కొండంత బ‌రువని రాశారు వెన్నెల క‌వి.. మ‌రి ఆ బ‌రువు ఏమ‌యిందో తెలియ‌డం లేదు స్నేహా! ఎక్క‌డున్నారు.. ఏమ‌యిపోయారు.. బిడ్డ‌ల‌తో న‌వ్వులు చిందిస్తున్నారు స‌రే ! మిమ్మ‌ల్ని అభిమానించే వారు ఏమైపోవాలి అండి?

ప్రియ‌మ‌యిన నీకు పాట‌లో ఓ మాట రాశారు ఒక సారి ద‌రిచేరి ఎద గొడ‌వేమిటో తెల‌క‌పోతే ఎలా అని అన్నారు.. మ‌రి! మీరు మా ఎద గొడ‌వ విన్నారా లేదా విన‌కుండానే వెళ్లిపోయారా? ఆహా! బిడ్డ‌ల ప్రేమ‌లో ఉన్న మీరు ఆ ఎద గొడ‌వేవిటో విన్నారా? ఆహా! న‌వ్వుల గొడ‌వేంటి అన్న‌ది మాకు చెప్పారా? లేదు క‌దా!

పాట‌లో వెన్నెల క‌వి చెప్పిన విధంగా కొత్త‌గా తెలుసుకునే వేళ ఏమ‌యినా ఉందా.. ఏమో మీ గురించి కొత్త‌గా తెలుసుకోవాలి మీ గురించి కొత్త వివ‌రం ఒక‌టి రాయాలి.. జీవితాల‌ను మీరు ప్ర‌భావితం చేసి వెళ్లారు.. మీ అభినయంతో మాకు ఏకంగా స్వ‌ర్గ‌లోక‌పు ఆనందాలే అందించారే!అందుకే మీరు మ‌ళ్లీ రావాలి.. అందం అభినయం క‌లిసిన న‌టులు అలా తెర‌కు దూరంగా ఉండడం భావ్యం కాదు. క‌నుక మ‌ళ్లీ మాట వినండి.

ల‌లితమ‌యిన భావాలు నిండిన పాట (మ‌న‌సున ఉన్న‌ది చెప్పాల‌ని ఉన్న‌ది అంటూ రాశారు) ఆ పాట రాశాక నేనెంతో ఆనందించాను అంటున్నారు వెన్నెల క‌వి సిరివెన్నెల.. సార‌ళ్యం నిండిన పాట.. సౌకుమార్యం నిండిన పాటలో స్నేహ నవ్వులు చూపులు రెండూ వేడుక‌లు చేస్తాయి.. వేడుక‌లు చేసే వేళ అమ్మాయిల ఆనందాలు ఉద్వేగాలు గొప్ప‌గా ఉంటాయి.. అలాంటి ప్రియ‌మైన నీకు.. స్నేహ‌కు రాయు మాట‌లే ఇవి..

– చిత్ర క‌థంబం – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version