ఎంత వయసు వచ్చినా సరే కనపడకుండా దాచుకోవాలి అనేది చాలా మంది ఆశ. అందుకోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు కొందరు. దీని కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండే ఈ సమస్య ఇప్పుడు గ్రామాలకు కూడా వచ్చింది. దీనితో పార్లర్లు అవి ఇవి అని చేస్తూ ఉంటారు. ఇందుకోసం డబ్బులను వృధా చేసుకుంటారు. కాని కొన్ని మన కిచెన్ లోనే ఉన్నాయని అంటున్నారు.
బ్లూబెర్రీలు తింటే నాజూగ్గా కనిపించడంతో పాటుగా వయసు తెలియదట. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు వల్ల వయసుతో వచ్చే శారీరక, మానసిక మార్పులను సులభంగా అధిగమించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
చిలకడదుంప, కేరట్, గుమ్మడి కాయల్లో బెటా-కెరొటెనె అధికంగా ఉండటంతో అవి, ఏజింగ్‌ను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయని సూచిస్తున్నారు. చర్మాన్ని పట్టులా ఉంచడంతో పాటు కళ్లకు ఆరోగ్యకరమైన మెరుపునిస్తాయట.
ఆకుకూరలు తినడం వల్ల చర్మం మెరవడమే కాదు వయసు కనపడదని అంటున్నారు.
విటమిన్-సి పుష్కలంగా ఉన్న బ్రొకెల్లీ తింటే చర్మం ముడతలు పడదట. వయసుతోపాటు వచ్చే చర్మం పొడారిపోయే గుణం కూడా పోతుందని సూచిస్తున్నారు.
ట్యున్, సాల్మన్ చేపలు యాంటి-ఏజింగ్‌గా బాగా పనిచేస్తాయని, వీటిని తినడం వల్ల యవ్వనంతో ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారట.
ఆలివ్ నూనె వాడితే యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండటంతో పాటుగా చర్మం, శిరోజాలు మెరుస్తుంటాయి.
కీర కూడా యాంటి ఏజింగ్ ఫుడ్. కీరలో నీరు బాగా ఉండడం వల్ల యుక్త వయసు కనపడటమే కాకుండా చర్మంపై ముడతలు పడవని సూచిస్తున్నారు.