మా హీరోయిన్స్ వద్దే వద్దా, మీ హీరోయిన్స్ ని మాత్రం మేము ముద్దు చేయాలా…. ఇదెక్కడి న్యాయం సామి….!!

-

ప్రస్తుతం బాలీవుడ్ కి వెళ్లే మన తెలుగు హీరోయిన్స్ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉందనే చెప్పాలి. గతంలో అతిలోక సుందరి శ్రీదేవి మాత్రమే ఇటు సౌత్ లాంగ్వేజస్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా నటించి చక్రం తిప్పి అన్ని భాషల్లో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. అయితే ఇప్పటి పరిస్థితులు చాలా మారాయి అనే చెప్పాలి. మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్న నటీమణులు సౌత్ లో బాగానే రాణిస్తున్నప్పటికీ, నార్త్ లో మాత్రం చాలా వరకు దెబ్బలు తింటున్నారు. దానితో అక్కడికి వెళ్లాలనుకుంటున్న మిగతా హీరోయిన్స్ కూడా కొంత ఆందోళనతో వెనకడుగు వేస్తున్నారు. మొహెంజదారో సినిమాతో పూజ హెగ్డే, హిమ్మత్ వాలాతో తమన్న, రుస్తుం తో ఇలియానా, అయ్యారీ తో రకుల్ ప్రీత్ ఇలా వరుసగా ఇక్కడ మంచి పేరుతో దూసుకుపోతున్న హీరోయిన్స్ అక్కడ భారీ పరాజయాలు అందుకుని మరొక్కసారి అక్కడ సినిమాలు చేయడంలో వెనక్కి తగ్గారు.

దీనితో నయనతార, అనుష్క, సమంత వంటి వారు సైతం బాలీవుడ్ కి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ప్రస్తుతం తయారయ్యాయి. అయితే ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లో సైతం కొంత మంచి పేరుతో దూసుకెళ్తున్న నటీమణి తాప్సి ఒక్కరే అని చెప్పాలి. బద్లా, బేబీ, పింక్, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, సూర్మ, మన్మర్జియా వంటి సినిమాల విజయాలతో ప్రస్తుతం తాప్సి అక్కడ దూసుకెళ్తోంది. ఇక ఇటీవల భూమి ఫడ్నేకర్ తో కలిసి ఆమె నటించిన సాండ్ కి ఆంఖ్ అనే సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇకపోతే ఇక్కడ మన సౌత్ ప్రొడ్యూసర్స్ మాత్రం అక్కడి బడా హీరోయిన్స్ అయిన శ్రద్ధ కపూర్, దిశా పటాని, ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనే వంటి వారిని ఇక్కడ హీరోల సరసన తీసుకోవాలని ఆశపడుతున్నారు.

 

నిజానికి బాలీవుడ్ హీరోయిన్స్ ని సౌత్ సినిమాల్లో తీసుకోవడంపై కొందరు ఒకింత నిరాశక్తి వ్యక్తం చేస్తున్నారు. మన వారికి  అక్కడ పెద్దగా ఆదరణ దొరకనప్పుడు, ఇక్కడ నిర్మాతలు ఇక్కడి ఎందరో గొప్ప నటీమణులు ఉండగా, అక్కడెక్కడో కోట్లు గడిస్తూ దూసుకెళ్తున్న బాలీవుడ్ హీరోయిన్స్ నే తీసుకోవాలని చూడడం సరైనది కాదని అంటున్నారు. అవకాశం ఉన్నంతవరకు సినిమాల్లో ఇక్కడి మన హీరోయిన్స్ నే తీసుకుంటే బెటర్ అని, దూరపు కొండలు నునుపు అనే విధంగా ఇక్కడి నిర్మాతలు వారి కోసం ఎగబడడం మానేయాలని వారు సూచిస్తున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news