బిక్షం వేయడానికి చిల్లర లేదా? అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించండి.. బిచ్చగాళ్లూ అప్ డేట్ అయ్యారోచ్..!

-

బిచ్చగాళ్లు అప్ డేట్ అయ్యారు. కానీ.. మన దేశంలో ఎక్కడా క్యూర్ కోడ్ తో ఏ బిచ్చగాడు కనిపించలేదే అంటారా? కనిపించరు. ఎందుకంటే.. ఈ అప్ డేటెడ్ బిచ్చగాళ్లు ఉన్నది మనదేశంలో కాదు.

అయ్యా.. బాబూ.. ధర్మం చేయు బాబు.. హే.. పో.. చిల్లర లేదుపో.. అంటూ బిచ్చగాళ్ల మీద మన ప్రతాపం చూపిస్తుంటాం. ఎవరైనా బిచ్చగాళ్లు మన దగ్గరికి వస్తే చాలు.. వాళ్లేదో మన ఆస్తిని లాక్కున్నట్టుగా వాళ్ల మీద విరుచుకుపడతాం. వాళ్లు అడగక ముందే చిల్లర లేదంటూ వాళ్లను అక్కడి నుంచి వెళ్లగొడతాం.

అయితే.. ఇక నుంచి మీ దగ్గర ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే.. మీ దగ్గర చిల్లర లేకపోతే.. QR కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు పంపాల్సిందే. క్యూఆర్ కోడ్ ను చూపించి మరీ.. బాబ్బాబు.. బాబ్బాబు.. అంటూ వెంటపడతారు.

అవును.. బిచ్చగాళ్లు అప్ డేట్ అయ్యారు. కానీ.. మన దేశంలో ఎక్కడా క్యూర్ కోడ్ తో ఏ బిచ్చగాడు కనిపించలేదే అంటారా? కనిపించరు. ఎందుకంటే.. ఈ అప్ డేటెడ్ బిచ్చగాళ్లు ఉన్నది మనదేశంలో కాదు. మన పొరుగు దేశం చైనాలో.

చైనాలో ఉన్న బిచ్చగాళ్లు ఎవరైనా సరే.. వాళ్ల మెడలో ఓ ఐడీ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్లకు అంతో ఇంతో డబ్బులు పంపించాలన్నమాట.

ఇప్పుడు టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందుకే.. బిచ్చగాళ్లు కూడా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని.. వీచాట్, అలిపే లాంటి యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. వాటి క్యూఆర్ కోడ్ ను ఐడీ కార్డు తరహాలో తయారు చేసుకొని చిల్లర లేని వాళ్లను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపించాలని కోరుతున్నారు. దాని వల్ల.. డబ్బులన్నీ వాళ్ల వాలెట్ లోకి వెళ్లిపోతాయి.

చైనాలో ఆన్ లైన్ లావాదేవీలే ఎక్కువ కదా. నగదు ఉపయోగించడం తక్కువ. చాలామంది వాటెట్లు, ఇతర టెక్నాలజీని ఉపయోగించి ఆన్ లైన్ లావాదేవీలు చేయడమే. అందుకే.. చాలామంది క్యాష్ ను క్యారీ చేయడం లేదు. దీంతో బిచ్చగాళ్లకు చిల్లి గవ్వ కూడా వస్తలేదట. దీంతో బిచ్చగాళ్లు కూడా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని.. క్యాష్ లెస్ లావాదేవీలకు అలవాటు పడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news