చర్మ సంరక్షణకి గ్లిసరిన్ .. ఎంతమేర ప్రయోజనకరం అంటే?

-

చర్మ సంరక్షణ గురించి చెప్పుకోవడం చాలా సులభం. అది ఇలా చేస్తే అలా అవుతుంది. అలా చేస్తే ఇలా అవుతుంది అని ఈజీగా చెప్పవచ్చు. కానీ దాని ఫలితాలు రావాలంటే చాలా వేచి చూడాల్సి వస్తుంది. అందమైన చర్మం మీ సొంతం కావడానికి మార్కెట్లో దొరికే అత్యంత ఖరీదైన సాధనాలే అవసరం ఉండాల్సిన పనిలేదు. చాలా తక్కువ విలువ గల సాధనాలూ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలా చర్మానికి అత్యంత సంరక్షణని ఇచ్చే పదార్థాల్లో గ్లిసరిన్ కూడా ఒకటి.

చర్మ సంరక్షణ నిపుణుల ప్రకారం గ్లిసరిన్ మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. మీ చర్మానికి సరైన ఆరోగ్యాన్ని అందించడంలో దీని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దీనికి సువాసన ఉండదు. అందుకే దీన్ని చాలా వాటిల్లో ఉపయోగిస్తారు. గ్లిజరిన్ మొక్కల నుండి దొరుకుతుంది. అలాగే చక్కెరను పులియబెట్టడం వల్ల కూడా దొరుకుతుంది. మాయిశ్చరైజర్లలో, పాత్రలు శుభ్రపరచడానికి ఉపయోగించే పదార్థాలలోనూ దీన్ని వాడతారు.

గ్లిజరిన్ వల్ల కలిగే లాభాలు

దీని నేచర్ ప్రకారం ఇది చర్మంలో నీటిని నిలుపుకుంటుంది. దానివల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇది చర్మం లోపలికి చాలా సులభంగా చొచ్చుకుపోతుంది. దీనిలో ఉండే ధర్మాలు, చర్మం చికాకుని గురి కావడాన్ని తగ్గిస్తాయి. దీన్ని హల్యూరిక్ ఆసిడ్ తో పోల్చవచ్చని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ గ్లిజరిన్ ని ఎంత పరిమాణంలో వాడాలనేది కూడా తెలిసి ఉండాలి. నిపుణుల ప్రకారం ఎవరి చర్మానికి సరిపడేంత వారు వాడాలి. 3శాతం నుండి 20శాతం మధ్యలోనే ఉండాలంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news