ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా ప్రతాపం చూపుతుందో చూస్తూనే ఉన్నాం. ఎక్కువ మంది ఊపిరాడక, శ్వాస సంబంధిత సమస్యలతోనే చనిపోతున్నారు. ఆక్సిజన్, ఆక్సిజన్ అంటూ పరుగులు పెడుతున్నారు. మరి సామాన్య జనం పరిస్థితే ఇలా ఉంటే ఇక ఆస్తమా పేషెంట్ల సిచ్యువేషన్ ఏంటి. వారికి ముందే శ్వాస సమస్యలు కదా. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి వారు తప్పించుకోవచ్చు.
ఆస్తమా పేషెంట్లు ఎక్కడికి వెళ్లినా సరే కనీసం ఎనిమిది అడుగుల దూరం మెయింటేన్ చేయాలి. ఎందుకంటే గాలిలో కూడా కరోనా వస్తోంది. అలాగే ఇంట్లో ఉన్నా వెచ్చగా ఉండే రూమ్‌లలో ఉండేందుకు ప్రయత్నించాలి.
వాళ్లు ఎక్కువగా వాడే ఇన్‌హేలర్‌ను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. ఇందులో రెండు రకాలుంటాయి. పౌడర్ ఇన్‌హేలర్, మీటర్ డోస్ ఇన్‌హేలర్. మీటర్‌డోస్ ఇన్‌హేలర్ వాడుతున్నప్పుడు స్పేసర్ కచ్చితంగా వాడాలి. అలాగే చల్లని పదార్థాలు అస్సలు తినకూడదు. చల్లటి నీళ్లు, చల్లటి వాతావరణంలో ఉండకూడదు.
వేడి వాటర్ తాగాలి. వీలైనంత వరకు వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా వాకింగ్, శ్వాస బాగా ఆడే వ్యాయామాలు, ఈత, చెట్లకింద ఎక్కువగా కూర్చోవడం, బయట తిరగకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ కొంచెం అనుమానం వచ్చినా డాక్టర్ సలహాలు తీసుకోవాలి. ఎక్కువ స్టిరాయిడ్ మందులు వాడకూడదు.